పల్లవి:ఇదియే సమయంబు రండి యేసుని జేరండి (1)ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి (2)
1. పాపులనందరిని తన దాపున జేర్చుటకై - ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా (2) మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా (2)
2. రాజులకు రాజైన యేసు రానైయున్నాడు గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి
3. బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటే - సిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతే తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి
4. వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు - ప్రభువా ప్రభువనుచు యెలుగెత్తి పిలిచినను మిమ్మును ఎరుగనూ మీ రెవరో పొమ్మనును
5. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా - నమ్మనివారికి నిత్య నరకము తప్పదుగా నిర్లక్ష్యము చేయకును రండి రక్షణ పొందండి
6. సందియపడకండి మీరు సాకులు చెప్పకను - సత్యవాక్యమును మీరు సరిగా చూడండి మరణ దినమును మన మెరుగము సుమ్మండి
7. జాలము చేయకను మీరు హేళనచేయకను - కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను తరుణముండగానే మీరు త్వరపడి రారండి