CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 382

ఇదియే అనుకూల సమయము నీకు

idiye anukoola samayamu neeku

2 Cor 6:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఇదియే అనుకూల సమయము నీకు - ఘన రక్షణ దినము (2)
అను పల్లవి:ఆటంకము లేక యేసు నంగీకరించి - చాటెద మెల్లడలన్ (2)
1. ఆయన రాకడ బహు సమీపమని - వాక్యము వ్రాసియున్నది (2) వంచకుల దుష్టకార్యములప్పుడు - బహిరంగ పరచబడున్ (2)
2. మత్తయి యిరువది నాలుగవ అధ్యాయము మార్కు పదమూడును లూకా యిరువదియొకట వధ్యాయము - చూడ ముగింపు తెలియున్
3. యుద్ధములు భువి జరుగుచునున్నవి - దైవచిత్తము జరుగున్ మరణముల సంఖ్య హెచ్చుచున్నది - నగరులు వణికెడును
4. దేవుడు రాగా నాకము మారును - భూమి దహనమగును నీళ్ళు సముద్రము లింకిపోవు - యేసు తిరిగి రాగన్
5. విశ్వాసులందరు నిల్చుట నిజము - దేవుడేసుని వాక్యము వెలలేని రక్షణ కల్గు సంపాద్యము - సంశయులకు లేదు
6. కాలము వ్యర్థము చేయకు ధరలో - కర్మముపట్టుకొనకు పాపమున్ ప్రేమతో పట్టియుంచకు - శాపము కౌగిలింపకు

Back to Hebron Seeyonu Geethalu