CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 392

యేసు రాజున్ నీ యెదలో

yesu raajun nee yedalo

Revelation 3:20

More
Reference recording on YouTube ↗
1. యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా? నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా?
పల్లవి:యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగాపాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము
2. లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా? నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా? ||యేసు||
3. ఇంక తామసించినచో - వెనుక మోసమగును ఇపుడే రక్షణ దినము - వెనుక రక్షణబ్బదు ||యేసు||
4. పిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుము నీదు జీవబలముల - నేడే సమర్పింపుము ||యేసు||
5. రేపు యని తామసింప - నష్టము కల్గు సదా మంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు ||యేసు||
6. యోహాను మూడు పదహా-రును విశ్వసింపుము దప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే ||యేసు||
7. హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురా త్రోసివేయ డెన్నడును - మంచి యేసునాథుడు ||యేసు||

Back to Hebron Seeyonu Geethalu