పల్లవి:స్తుతింతున్ - స్తుతింతున్ (1) - నాకాలోచన కర్తయగు దేవుని (2)రాత్రివేలలో - నా - అంతరింద్రియములు నాకు నేర్పున్ (1)
1. నాదు స్వాస్థ్య పానీయ భాగము - నా యెహోవా నీవే కాపాడెదవు (2) మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్ (1)
2. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను - సదా కాలము యెహోవాయందు నా గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్
3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు - గాన కదల్చబడలేను ఎన్నడు అందుచే నా హృదయ మానందించును - స్తుతింతున్
4. నా శరీరము సురక్షితంబుగా - నివసించుచున్నది ఏలననగా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్
5. జీవముగల నీ మార్గమును - నీవు నాకిల తెలియ జేసెదవు నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్
6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - సంపూర్ణ సంతోష మెంతో గలదు నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్