పల్లవి:చూడుము ఈ క్షణమే కల్వరిని (1)- ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను (1)గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు (1)- సిలువలో వ్రేలాడు చున్నాడుగా (2)
1. మానవు లెంతో చెడిపోయిరి - మరణించెదమని తలపోయక (2) ఎరుగరు మరణము నిక్కమని - నరకమున్నదని వారెరుగరు (2)
2. ఇహమందు నీకు కలవన్నియు - చనిపోవు సమయాన వెంటరావుచనిపోయినను నీవు లేచెదవు - తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
3. మనలను ధనవంతులుగా చేయను - దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై - అంగీకరించుము శ్రీ యేసుని
4. సిలువపై చూడుము ఆ ప్రియుని - ఆ ప్రేమకై నీవు యేమిత్తువుఅర్పించుకో నీదు జీవితము - ఆయన కొఱకై జీవించుము