1. రక్షణంపు వార్తను విని - రక్షకుండగు యేసుని పిల్పుకు లోబడెదవా - అలయక యేసును జూతువా
పల్లవి:నమ్మి రమ్ము నమ్మి రమ్ము - ఇమ్ముగ బ్రతుకుము (2)
2. వేసవి కాలమెల్ల గడిపి - కోతల ననుభవించితి వేసవి వర్షమును చూచితివి - ఇంక పాపమందున్నావే ||నమ్మి||
3. యేసు నీ తీర్మానముకై - వేచియుండగా తీర్మానించు ఆత్మ పోరాడుచున్నప్పుడే - అప్పగించుకో ప్రక్కజూచి ||నమ్మి||
4. తగుదునా యని యను కొనక - వేరు స్పర్శల నొందకుము తలంపు కాదు నమ్మికయే - ఆత్మ ముద్రనిచ్చును ||నమ్మి||
5. చిత్తము దేవదత్తముజేయ - ప్రాయశ్చిత్తరక్తము నమ్ము నాకమందుండు యేసుని చూడు - మారని వాక్యమును చేరుము ||నమ్మి||
6. యెషయా ఒకటి పదునెమ్మిది - నలభై ఐఫు ఇరవై రెండును యేసు క్రీస్తు అరచి చెప్పుదాని - ఆయనన్ కూడ పొందుము ||నమ్మి||
7. యిర్మియా ఎన్మిదిరవైయును - రెండవ కొరింథీ ఆరు రెండును కార్యములు నాలుగు పండ్రెండును - పొంది హల్లెలూయ పాడుమా ||నమ్మి||