CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 412

నా మాట వినుమని ప్రభువనెను

naa maata vinumani prabhuvanenu

Hebrews 3:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా మాట వినుమని ప్రభువనెను (2)- నిను రక్షింపను పిలుచు చుండె (2)
1. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు (2)- నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్ (2) నిను హృదయంబార ప్రేమించును (2)- ప్రేమించును (1)
2. తప్పిన వారిని వెదకవచ్చెన్ - తానే వెదకె నిన్ పరికించుము దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను
3. జీవన దాతగా ప్రభు యేసు వచ్చెన్ -నిత్య జీవము నీకు కలిగించును కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను
4. జీవన జ్యీతిగా జగమున కొచ్చెన్ - నీ వెరిగితివా నీ స్థితిని నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును
5. పాత వాటిని పారగ ద్రోలన్ -నూతన పరచును సర్వమును పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని

Back to Hebron Seeyonu Geethalu