పల్లవి:దారితొలగితివేల (2) - రక్షణ మార్గము వెదకు (2)
1. పాపమందే జన్మించితివి (2) పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2)
2. పాప ఫలితము ఘోరమరణము నరకదండన అగ్ని గుండము - మారు మనస్సు నొందు
3. నేడే యేసుని వాక్యము వినుము (2) నేడే ప్రభుని స్వరము వినుము - తన చిత్తము నెరుగు
4. నీవు నశించుట కోరడు ప్రభువు (2) తరుణముండగ వేడుకొనుము - ఎరుగు నీ స్థితిని
5. అందరిని మారుమనస్సును పొందుమని ప్రభువాజ్ఞాపించె - పశ్చాత్తాపపడుము
6. ఒప్పుకొనుము నీ పాపమును క్షమాపణకై వేడుకొనుము - రక్షణ పొందెదవు
7. విశ్వాసముతో అడిగిన యెడల పొందితివని నిశ్చయముగ నెరుగు - గొప్ప రక్షణ యిదియే