CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 42

సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే

sarvonnatuni chaatuna nivasinchedi vaade

Psalms 91

More
Reference recording on YouTube ↗
1. సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే (1) సర్వశక్తుని నీడను విశ్రమించును - పరమ ధన్యత యిదియే (2)
పల్లవి:తన రెక్కల క్రింద ఆశ్రయము - తన రెక్కలతో కప్పును (2)
2. ఆయనే నా ఆశ్రయము - నా కోటయు దుర్గమును ఆయన సత్యము నా కేడెమును - నేనమ్ముకొను దేవుడు
3. పగటి బాణమున కైనా - రాత్రి భయమున కైనా చీకటిలో తిరిగు తెగులుకైనా - నేనేమి భయపడను
4. వేయి పదివేలు - కుడిప్రక్కను కూలినను దయచూపు దేవుడు నీకుండ - అపాయము రాదు
5. నీ ప్రభువాశ్రయమే - యెహోవా నివాసం అపాయము తెగులు - నీ గుడారము సమీపించవు
6. నీదు మార్గంబులలో - నిన్ను దూతలు కాయున్ పాదములకు రాయి తగులకుండ - నిన్నెత్తికొందురు
7. కొదమ సింహముల - నాగుపాముల నణచెదవు అతడు నా నామము నెరిగెను - అతని తప్పించెదను
8. అతడు నను ప్రేమించెన్ - నామమున - మొఱ్ఱపెట్టెన్ అతని విడిపించి ఘనపరతున్ - అతని కుత్తరమిత్తున్

Back to Hebron Seeyonu Geethalu