CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 43

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా

yehovaanu stutinchuta manchidi mahonnatudaa

Psalms 92

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా (1)నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది (2)
1. ఉదయము నందు నీదు కృపను ప్రతిరాత్రిలో నీ - విశ్వాస్యతను (2) యెహోవా నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది (2)
2. పదితంతులు గల - స్వరమండలమున్ గంభీర ధ్వనిగల - సితారలను వాయించి నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది
3. ఎందుకనగా యెహోవా - నీ కార్యము చేత నీవు నన్ను సంతోష-పరచు చున్నావు నీ చేతిపనులను బట్టి - నేనుత్సహించుచున్నాను
4. యెహోవా నీ కార్యము - లెంత మంచివి నీ యాలోచన లతి - గంభీరములు పశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు
5. నిత్యనాశనము - నొందుటకే గదా భక్తిహీనులు గడ్డి - వలె చిగుర్చుదురు చెడు కార్యములను - చేయువారు - పుష్పింతురు
6. మహోన్నతుడవుగా - నిత్యముండు యెహోవా నీ శత్రువు లెహోవా - నశియించెదరు చెడు పనులను చేయు - వారందరు - చెడిపోదురు
7. నీతిమంతులు తమా-ల వృక్షమువలె నాటబడినవారై - యెహోవా మందిరములో ఎదుగుచు మొవ్వు వేసి - వర్థిల్లుచు నుండెదరు
8. నాకు ఆశ్రయమైన - యెహోవా యథార్థుడు చెడుగు లేనివాడని - ప్రసిద్ధి చేయుటకు సారము కలిగి - పచ్చగ నుందురు వృద్ధులు

Back to Hebron Seeyonu Geethalu