పల్లవి:ప్రియయేసు నిర్మించితివి - ప్రియమార నా హృదయం (1)ముదమార వసియించు నా - హృదయాంతరంగమున (2)
1. నీ రక్త ప్రభావమున - నా రోత హృదయంబును (2) పవిత్రపరచుము తండ్రీ - ప్రతిపాపమును కడిగి (2)
2. అజాగరూకుడనైతి - నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై - కనిపెట్టితివి తండ్రీ
3. వికసించె విశ్వాసంబు - వాక్యంబును చదువగనె చేరితి నీదు దారి - కోరి నడిపించుము
4. ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా