1. పాపభారము దుష్టగుణ సమేతుండనై దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ (1) చిన్న స్వరము వినబడె నన్ను పిలుచునట్లుగా (1) రమ్ము పొందు నాదుసిల్వ విశ్రాంతి (1)
పల్లవి:సిల్వలో సిల్వలో - పాపమెల్ల బోయె సిల్వయందున (1)భారమెల్ల వీడెను - రాత్రి పగలాయెను - కనుగొంటి సిల్వలో రక్షకుని (1)
2. ఏగుచుందు నిత్యము జీవమును బొందను సిల్వలో కృపశక్తి పొందుదున్ శోధనలు వచ్చిన జయ మొందుచుందును మోకరించి ప్రార్థింతు సిల్వచెంత ||సిల్వలో||
3. జీవితమందు ఏడ్పు బాధ శోధన్లలెల్ల ఆత్మసాయముచే సిల్వజూతును యేసు పాపికొరకుపడ్డపాట్లు చూడగా భారముల మోయుశక్తి పొందుదున్ ||సిల్వలో||
4. భారముచే క్రుంగిన పాపీ నేడే రారమ్ము యేసు రక్తమందు నిన్ను కడుగును " నిత్యజీవ మిచ్చును నిన్ను సమర్పించుకో క్రీస్తు యేసు క్రొత్త శక్తి నిచ్చును ||సిల్వలో||