పల్లవి:పరిశుద్ధ శ్రీ యేసువే - పరలోకరాజుమురియుచు నే పూజింతును - నిరతము - పరిశుద్ధ శ్రీ యేసువే (1)
అను పల్లవి:పరలోక మహిమనుండి - నరుల రాజ్యములలో (2)నిరతము తన పాలనము జరిగించుచున్నరాజు (2)
1. పెనూయేలు పోరాటంబున - పోనివ్వనంచు - పెనుగునందున యాకోబు - వినయమున (2)- పెనూయేలు పోరాటంబున (1) నన్ను దీవించు తండ్రీ - నిన్ను నే విడువనంచు (2) కన్నీటితో వేడగా - ఘనత ఇశ్రాయేలనియె (2)
2. ఈ దినమున నుండి - పదిలముగ - ముదముగ దీవింతుననెన్ - ఆదరణకర్త - ఈ దినమున నుండి తుదిమందిర పునాదిపై - కదలక నిలుచువారిన్ కదలని నా పునాది - యూదాగోత్ర సింహంబు
3. సీయోనులోనుండి - ప్రియుడైన యేసు - కాయుచు నిను దీవించును - ఆయన త్రోవన్ - సీయోనులోనుండి పాయక నిన్నెప్పుడు - పరిపాలించు చుండును రయమున నిన్ను జేరి - సాయంబు చేయుచుండు
4. జయించుచున్న వానికి - మరుగైన మన్నా ప్రియమున భజియింపనిచ్చున్ - జయశాలి- జయించుచున్న వానికి వ్రాయబడిన క్రొత్తనామ మున్నట్టి తెల్ల రాయినొసంగి వాని భయము తొలగించు జయము "
5. నడిపించుచుండె నిత్యము - తన దృష్టి నిలిపి విడువకుండగ నీ ప్రభు - కడవరకు - నడిపించుచుండె నిత్యము ఎడతెగని తనదు ప్రేమ - కనుపరచి తృప్తిపరచి చెడుగునెల్లను బాపి - తన యడుగు జాడలలో
6. బలము నారోపించుము - బలమిచ్చు ప్రభువు - సిలువలో నీకై సమసెను - సీయోను - బలము నారోపించుము గెలిచె సమాధినుండి - బలముతో తిరిగిలేచె ఎల్ల మేలుల తలచి - హల్లెలూయ పాడెదము