CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 439

జయించువాడు దేవకుమారుడు

jayinchuvaadu devakumaarudu

Revelation 21:7

More
Reference recording on YouTube ↗
1. జయించువాడు దేవకుమారుడు - భయము చెందక యుండుడి (2) సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును - సర్వ దేవుని వాక్కిదే (2)
2. ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా - అదియే నీ కొఱత జయించిన నీవు జీవఫలములను - ప్రియముగ భుజియింతువు
3. శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్ జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు
4. పెర్గము సభ నీ బోధయు తప్పుడు - మార్గముల నెరుగుదున్ జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్లని రాతినిత్తున్
5. తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ - నీ భయముల నెరుగుదున్ జయించిన జనులపై నధికారమిత్తున్ - వేకువ చుక్కనిత్తున్
6. సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు - త్వరలోన స్థిరపడుము జయించిన నీకు తెల్లని వస్త్రము - లిచ్చి నిన్నొప్పుకొందును
7. ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా - నీ అశక్యత తెలియున్ జయించిన స్తంభముగా నుంచి నీకు - క్రొత్త నామము నిడుదున్
8. లవొదికైయ సభ నీ లక్షణముల - దౌర్భాగ్యత తెలియున్ జయించిన నిన్ను సింహాసనమున - నాతో కూర్చుండనిత్తున్
9. జయమొందు విధమున తెల్పితి నిందు - జయించువారి భాగ్యము అపజయమును పొందు విధమును దెల్పితి - నీవెటు నిల్చెదవో

Back to Hebron Seeyonu Geethalu