CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 444

సంతసిల్లును మీ హృదయాలు

santasillunu mee hrudayaalu

Acts 8:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:సంతసిల్లును మీ హృదయాలు (2) - సీయోను మహిమజూచి (2)
1. సుందర వరుడు యేసు ప్రభువు (2) - సుందరవతి సీయోను (2) శాశ్వత శోభాతిశయముతో (2) - భాసిల్లుటను జూచి (2)
2. నీలమయ నిత్య పునాదులు - మేలిమి ఛాయామణులు సూర్యకాంత సుగంధములు - పుష్యరాగ నిర్మితము
3. నిత్య మహిమతో వెలిగెడు - ముత్యాల గుమ్మములు స్వచ్ఛమగు సువర్ణమయము - ఆశ్చర్య నగరము
4. జీవవృక్షము జీవఫలములు - జీవామృతపానము కాంతి వంతముగా మెరిసేటి - వింతలుగొల్పు నగరము
5. స్వర్ణ సమము దాని ప్రజలు - సంతోష సహితులు దూతలే వింతపడునట్లు - ఖ్యాతిని కలిగిన వారు
6. మందిర సమృద్ధిని వారు - తృప్తి నొందుచున్నారు ఆనంద ప్రవాహమునందు - పానము చేయుచున్నారు
7. దేవుడు సెలవిచ్చినయట్టి - దేవో క్తులలో నేది జరుగకుండగ పోలేదు - వరుసగా నెరవేరెన్

Back to Hebron Seeyonu Geethalu