CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 458

మనమే ప్రభుని పరలోక గృహము

maname prabhuni paraloka gruhamu

Ephesians 2:19

More
Reference recording on YouTube ↗
పల్లవి:మనమే ప్రభుని పరలోక గృహము - తానే వసించును దానియందు (2)
1. ఎంత సుందరమో ప్రభుని గృహము (2) - నలుదిక్కులనుండి కూర్చెనుగా (2) ఏక శరీరము రక్తబంధముచే (2) వేలాది భాషల నుండినను (2)
2. ఒక నూతన వ్యక్తిగా మము జేసె - పరమ గృహమునకు చెందితిమి ఐక్యతతో స్థిరముగ నమర్చబడి దేవుని గుడారముగా నైతిమి
3. నల్లని తెల్లని వారని లేదు - ధనికులు దరిద్రులనియు లేదు పామరులని జ్ఞానులని లేదు యేసు ప్రభువే సర్వముగా
4. ప్రభుని గృహమున కలహము లేదు (2) - ఈర్ష్య కపట భేధము లేదు శాంతి ఆనందము నిజ ప్రేమయుండును నేర్పుతో నడుపును మన ప్రభువే
5. ప్రభుని గృహము యిద్ధరయందున్నది - తన దాసుల కధికారమిచ్చె ప్రతివానికి వాని పని నియమించె కావలి యుండుము మెలకువతో
6. దృఢ విశ్వాసము మదినందుంచి - విజయులలై యాత్రలో సాగెదము ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగ శత్రువు నోడింతుము
7. ప్రియుని దినము సమీపించు చున్నది - చెప్పెను మేల్కొని యుండుమని విశ్వాస యోగ్యులముగ జీవించి ఓరిమితో వేచియుండెదము

Back to Hebron Seeyonu Geethalu