1. ఓ పావనులారా - మీరు విశ్వాసంపు - పునాది యెంతెంతో - స్థిరమైనది శ్రేష్ఠంపు వాక్య - మా కందము నిచ్చున్ - శ్రీ యేసు నాశ్రయించు శ్రీ యేసు నాశ్రయించు - తన్నాశ్రయించు వారే - ధన్యులు
2. నీకెట్టి విపత్తు - సంభవింపగాను - నే నీతో నున్నాను భయ - మేటికి దేవుడన్ - నే నీ కొనర్తున్ సాయం -నా గొప్ప శక్తితోను - నా గొప్పశక్తితోను నా గొప్ప శక్తితోను - నిన్నిల్పుదు
3. దేవాగ్ని పరీక్షలు - నీకు కల్గగాను - కృపాశక్తి మెండుగా - నీకిత్తును ఆ మంట నిన్ను - నావరింపగాను - నీలోని కల్మషంబు - నీలోని కల్మషంబు నీలోని కల్మషంబు - దహించును
4. వృద్ధాప్యము నందు - స్వంత ప్రజలెల్ల - నా మారని ప్రేమ రుచి - చూతురు ప్రాయమున్ ప్రొద్దు - గ్రుంకినట్టి వేళన్ నే కౌగిలింతు వారిన్ - నే కౌగిలింతు వారిన్ నే కౌగిలింతు వారిన్ - నా కౌగిటన్
5. నా యందు విశ్వాస - ముంచునట్టి యాత్మన్ - నే విడ్వను శత్రుకోటి - చేతికిన్ పాతాళ మెల్లన్ - వాని మ్రింగజూడన్ - నే నెల్ల వేళలందు - నే నెల్ల వేళలందు నే నెల్ల వేళలందు - రక్షింతును