CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 472

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు

kreestuni svaramu vindunu prabhuve palikinappudu

Psalms 29

More
పల్లవి:క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడుమధుర స్వరమేయది మెల్లని స్వరమే యది (2)
1. యెహోవా నీ స్వరము - జలములపై వినబడెను (2) మహిమగల దేవుడు (2) - ఉరుమువలె గర్జించెను (1) మహిమగల దేవుడు - ఉరుమువలె గర్జించెను (1)
2. బలమైన నీ స్వరము - బహుప్రభావము గలది దేవదారుల విరచును - ప్రజ్వలింప చేయునగ్నిని
3. అధ్భుత ప్రభుస్వరము - అరణ్యము కదిలించును ఆకుల రాలజేయును - లేళ్ళ నీనజేయును
4. ఆలయమందన్నియు - ఆయననే ఘనపరచున్ ఆశీర్వాదము శాంతి - నోసగు నాయన స్వరమే
5. నీ మధుర స్వరము - నీ వాక్యమున విందున్ ప్రార్థనల యందున - ప్రతిదినము పల్కెదవు
6. నీ మధుర స్వరము - నీ చిత్తము తెల్పును అనుదిన జీవితములో - అనుసరించెద నిన్ను
7. నీ మధుర స్వరము - నీ మార్గము జూపును కుడియెడమల తిరిగిన - నీ స్వరమే వినబడును
8. తుఫానులు కలిగి - భయభీతులలో నుండ భయపడకు మనిపలికే - ప్ప్రేమగల నీ స్వరము
9. మరణాంధకార - లోయలో నేనుండ నీకు తోడైయుంటి - ననెడి స్వరమును వింటిన్
10. ప్రభువా సెలవిమ్ము - నీ దాసు డాలించున్ దీనుడనై నీ మాట - అంగీకరించెదను

Back to Hebron Seeyonu Geethalu