పల్లవి:ఆ దినములలో దేవోక్తి (2) - అరుదాయెను - దేవునివార్త (2)ఆ దినములలో దేవోక్తి (2)
అను పల్లవి:దైవోక్తి ప్రత్యక్షత - దొరుకునదే - అరుదాయెనట - ఆదినములలో దేవోక్తి
1. ఇశ్రాయేలీయుల కానాడు (2) - యే రాజు లేకపోయె (2) తనయిష్టానుసారముగా (2) - తిరుగుచుండెను ప్రతివాడు (2)
2. పరమ తండ్రి మందసము - చెరపట్టబడినందున ప్రభావము పోయెను - ప్రభుని ప్రజలలో నుండి
3. దావీదంతకంతకు - దినదినము వర్థిల్లెను సైన్యములధిపతి యెహోవా - సర్వదా తనతోడై యుండెను
4. సొలమోనర్పించిన - బలుల నగ్ని కాల్చగనే ప్రభుని ఆలయమంతయు - ప్రభావముతో నిండెను
5. లెమ్ము తేజరిల్లుము - నీకు వెలుగు కలిగెను యెహోవా తండ్రి మహిమ - నీ మీద నుదయించెను
6. యెహోవా పట్టణమని - ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనని - నీకు పేరు పెట్టెదరు