పల్లవి:నిత్యము - నిలుచునది - దేవుని వాక్యముసత్యమై యున్నది - సర్వము చేయునది
అను పల్లవి:ఆ వాక్యమే యేసు దైవము - ఆదియందు ఉన్న దైవము (2)అంతమే లేని దైవము
1. అంధకారమును - తొలగించు జ్యోతి అది ప్రతి మనిషిని వెలిగించు - మహిమ వెలుగు అది (2) వెలిగించును - నడిపించును - త్రోవకు దీపమై (2) - ఆ వెలుగు వాక్యము (1)
2. ఎండిన ఎడారిలో - నీటి ఊటవంటిది వడిగా ప్రవహించు - జీవనదియే అది దప్పిగొనిన - ప్రతి జీవి - దప్పిక తీర్చునది - ఆ జీవ జలవాక్యము
3. అపవాదిని అణచివేసె - ఆత్మఖడ్గమది రెండంచులు వాడీగలదై - వధించును వైరులను ఓడించును - విడిపించును - తోడై ఎల్లప్పుడు - ఆ శక్తిగల వాక్యము
4. పోరాడుము యేసుకై - మంచి సైనికునిగా శ్రమలను భరించుము - వాక్యములో బలమొంది తన ఐశ్వర్యములో - తీర్చును - నీ ప్రతి అవసరము - ఆ దేవాది దేవుడు
5. నిత్యుడగు దేవుడు - త్వరగా వచ్చుచున్నాడు జయించు వారినెల్ల - తనతో కొనిపోవును తన వాక్యమునందు వర్ధిల్లుచు - విజయుడవై యుండుము హల్లెలూయా హల్లెలూయ - (3)