పల్లవి:నా దృష్టి నీపై నిలిపి - నాదు యోచనలతో సదోపదేశముసదా నే జేసెద - నడువ నీవు నా మార్గమును2
1. మరణము నుండి ప్రాణము నిరతము విడిపింపును ధరలో జీవించన్ కరువులో మరి సజీవులుగా - నీతిమంతులపై ప్రభు నేత్రం నిలుచును నిలకడగా యదార్థుల మొఱ యెహోవా వినులు వినును వీడక సహనముతో
2. యెహోవా నేత్రములు ఏడు - జెరుబ్బాబేలు చేతకాని గుండు నులున్ సంతోషించును బహు మెండుగాను - మహిమతో వేసెను వినయముగా మందిర పునాదిని ముగించునతని చేతులు ముదమున జరుగునిది దైవాత్మచే
3. దైవాసన పెద్దల మధ్య - చంపినట్లున్న సజీవ గొఱ్ఱెపిల్ల యేసుని కన్నులు నిన్ను కనగా జివించ్చుచున్నాను కొనినన్ మృతుడవే నీవిలలో చావనైనను వాటిని సరిదిద్దు జాగ్రత్త యేసుని స్వరము విను
4. మదిలో పరమ ప్రభువునెరుగు - యధార్థహృదముల బలపరచ పృదివి లో పయనించి చూడగా ప్రభుదృష్టి యెహోవాను వీడి వెల్లెను ఆసా - సిరియా రాజు దరికి మతి తప్పి నీవు మది వర్తించితివి - ఇది మొదలు నీకు యుద్ధములే
5. స్వార్ధముతో నేనబదినై - వ్యర్థముగా నడిచిన యెడల మోసముకై త్వరపడి - నా పాదము పరుగిడిన దృష్టించు ప్రభు నేత్రోవలను - లెక్కించు అడుగులను దేవుడెరుగు నా యదార్థతంతయు - తరచి తూచును త్రాసులో
6. ఏడు ఆత్మల ఉపదేశం - ఏడు సంఘముల హెచ్చరించన్ రూఢిగ మేఘమున ప్రభు వేగమిలకు రాగా బీతితో గాంచు ప్రతి నేత్రం - పొడిచిన వారు సహా లోకులు రొమ్మును బాదుకొందురు - బహు సిద్ధమా నీవు ప్రభుని చేర
7. ప్రభు ఆలోచన నిలుచు సదా ప్రభుసంకల్పము తర తరముల్ సంస్తుతితో నీతిపరులు క్రీస్తు సన్నిధని ఆనందించుడి దేవునిలో క్షితిని ప్రతి క్షణము యదార్ధ హృదయులందరు ఏకమై చేయుడి ఉల్లాస గానము