పల్లవి:యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో (1)నీతిమంతులయ్యెదరు - యేసుని నమ్మెడివారు (1)
1. ఖర్జూరపు చెట్టువలె - మొవ్వు వేయుచుండెదరు (2) ఖర్జూరపు మట్టలతో - రక్షణకై స్తుతించెదరు (2)
2. లేబానోను దేవదారు - చెట్టువలె ఎదుగుదురు ప్రభు కృపాజ్ఞానములో - ఎదుగుచు నుందురువారు
3. యెహోవా మందిరములో - నాటబడి యుండెదరు సహనముతో నిలిచెదరు - కదలక స్థిరులై యుండెదరు
4. దేవుని యావరణములో - వర్ధిల్లుచు నుండెదరు సేవింతురు తమ ప్రభుని - ఘనపరతురు నిరతంబు
5. వారు ముసలితనంబున - చిగురు పెట్టి ఫలింతురు ప్రసిద్ధి చేతురు ప్రభుని - యథార్థవంతుడనుచు
6. నీటి కాలువ యోరను - నాటబడిన వారలై మేటిసారము కలిగి - పచ్చగ నుందురు వారు
7. హల్లేలూయ పాటపాడి - వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురాకడకై - మెల్లగా వేచియుండెదరు