CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 487

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

yehovaanu stutinchudi aayana dayaaludu

Jeremiah 15:21

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవాను స్తుతించుడి - ఆయన దయాళుడుశత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే (2)
1. యోసేపును విడిపించిన కర్త - ఎల్ల - మోసములోనుండి కాచున్ (2) ప్రియముతోడ పాశముతోడ (2) నాశము లేకుండ బ్రోచిన దేవుడే (1)
2. షిమ్యోనును గాచిన ప్రభువు - ప్రతి - నిమిషము మనలను కాచున్ కూడెద మిపుడే స్తోత్రముతోడ పాడెద మిచ్చట కూడిన మనము
3. మనష్షేను కరుణించి - వాని పాపములను మన్నించెన్ రాజాధిరాజు తప్పడు మాట ఎన్నటెన్నటికి మనతో నుండును
4. యెహోయాకీను తలనెత్తి మరణాజ్ఞనుండి మన్నించి చెరవస్త్రములను మార్చిన తండ్రి డాగులేని వస్త్రముల మనకిచ్చెను
5. యిర్మియాను పైకెత్తి - చెఱ ముట్టడినుండి కాపాడి విడుదలనిచ్చి యింటికి నడిపి కష్టములబాపి ప్రేమ చూపించెను
6. పేతురును కాచినదూత - అనేకులకాచిన ప్రభువు ప్రార్థనలెల్ల వెంటనే వినుచు సంఘపు మొఱలను విని విడిపించెను
7. పౌలును సీలను కాచి - సంఘ చింతల నెల్లను తీర్చి విడుదల నిచ్చున్ తిమోతియుకు కడు భక్తితో పాడెదముగా హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu