పల్లవి:మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి (2)
1. తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమ - వలె ఆయన మహిమను - కనుగొంటిమి (2)
2. నీవు నమ్మిన యెడల - దేవుని మహిమ చూతువు - జీవ పునరుత్థానము యేసు
3. ప్రత్యక్షగుడారమును - మేఘము కమ్మగానే - యెహోవా తేజస్సు నిండెను
4. దేవుని నివాసము - మనుజులతో నున్నది - నివసించు - దేవుడే వారిలో
5. మహిమా ప్రభావముతో - మకుటము ధరించిన క్రీస్తు - తనయులను తెచ్చె మహిమకు
6. మన రక్షణ కర్తను శ్రమతో - సంపూర్ణుని జేయ - మన తండ్రికే తగియున్నది
7. మన చులకని శ్రమలు - రాబోవు మహిమ యెదుట - ఎన్నతగినవి కావు
8. పరిశుద్ధ పట్టణములో - దేవునికే మహిమ - ప్రభువునకే మహిమ హల్లెలూయ