పల్లవి:దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము (2)వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2)
1. పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా (2) ఆవరించె మరణ ఉరులు (2) - క్రుంగిపోతినో దేవా (3) ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని (2) అందుకే నే పాడెద - కీర్తించెద (1)
2. నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారు దేవా నీ రక్షణ నా నుండి - దాటిపోయెననె వారు ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని అందుకే నే పాడెద - కీర్తించెద
3. నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని పాపినై యుండి పాపమెరుగనంటి - శాపగ్రస్తుడనైతి దేవా ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని అందుకే - నే పాడెద - కీర్తించెద
4. మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమును విప్పిచూపి శిక్షింపనంటివి - కక్షలేని నా దేవా అర్హతలేనివాడను - సర్వము పోయినవాడను అందుకే నే పాడెద - కీర్తించెద
5. నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లును శ్రమపొంది యుండుట నాకు - మేలని నేర్పించితివి నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేను ధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద
6. పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై ఒట్టు పెట్టుకొని నేను చెప్పెద - విడచిపోదు నిన్ నాదు కృప నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్త ధ్వనులు నా హృదయ ధ్యానం అంగీకరించు దేవా - కీర్తించెద
7. నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనె తెలిసికొందువు నీవు ఇక ముందుకు - నా పరిపూర్ణ మార్గమిదే వింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపము హల్లెలూయ పాడెద - కీర్తించెద