పల్లవి:లోకం, జీవం, మరణంబైనన్ -సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్ (2)
1. ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైనను (2) వాస్తవముగా సమస్తము మీవె (2) - మీరేసుని వారు (1)
2. తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనో కన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు
3. హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకు పదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును
4. అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు
5. అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచును యేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు
6. మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడు వారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు
7. జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగా ఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు