CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 515

సర్వశక్తుని వాక్కు యిదియే

sarvashaktuni vaakku yidiye

1 Cor 3:21

More
Reference recording on YouTube ↗
పల్లవి:సర్వశక్తుని వాక్కు యిదియే - సర్వమును మీవే - దేవుని సర్వమును మీవే (1)
1. పౌలైన కేఫాయైన - అపొల్లోయైన - లోకమైన (2) ఉన్నవి మరి యేవియైన (1) - సర్వమును మీవేగా (2)
2. జీవమైనను మరణమైన - ప్రస్తుతమందున్నవైన రాబోవునవియైనను - సర్వమును మీవేగా
3. దేవుని పనివారైన - దేవుని గృహమైన దేవుని వ్యవసాయమైన - సర్వమును మీవేగా
4. భూమి ఆకాశములందు - అధికార దీవెనలు సంఘ సంపూర్ణతయును - సర్వమును మీవేగా
5. నీరు కట్టిన తోటైన - నీటి యూటలైనను ఫలములిచ్చు చెట్లయినను - సర్వమును మీవేగా
6. అన్ని స్వతంత్రించుకొని - దైవపుత్రులగుటయును అవసరతల ననుభవింప - సర్వమును మీవేగా
7. క్రొత్త సృష్టి స్వాస్థ్యము - పుత్రశ్లాఘ్యమైనను దేవుని జీవవాక్యము - సర్వమును మీవేగా

Back to Hebron Seeyonu Geethalu