CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 516

సంపూర్ణ రక్షణయూట

sampoorna rakshanayoota

Psalms 53:6

More
1. సంపూర్ణ రక్షణయూట - పొంగుచున్నది చూడుము ప్రవహించే రక్షకుని ప్రక్క - గాయమునుండి ఎల్లెడల సంపూర్ణ రక్షణ ప్రవహించె - శాశ్వత రక్తనదులు
2. హా! మహిమ ప్రత్యక్షత చూడు ఎడతెగని ప్రవాహము శిక్షయును మచ్చల కడిగెను - హిమముకంటె ధవళముగా పూర్ణరక్షణ నెరుగుటచేత - ఆశీర్వాదములు కల్గున్
3. అడ్డులేని ప్రేమ ప్రవాహం - ప్రవహించె నన్ని చోట్ల శుద్ధముగానుంచును తలంపులను - వాంఛలను సదాకాలం పాపమలిన శక్తినుంచి - సంపూర్ణమగు రక్షణ
4. నిత్యమోక్ష జీవము దిగెను - నా హృదయ ఆలయమందు దేవుడు నరుడైక్యపడుట - ఆహా! ఎంతటి స్నేహమిది క్రీస్తుతో దివ్యజీవమునకు - జేర్చబడిన రక్షణ
5. దుఃఖము చీకటి భయము సిగ్గు - చింత నావిక కానేరవు నా రక్షకుడు ముందు నడుచును చీకటి లేదు విశ్వాసములో సర్వసంపూర్ణమగు రక్షణ - శాశ్వతమగు రక్షణ

Back to Hebron Seeyonu Geethalu