1. జీవితంబు ఘోర కష్టనష్టముల్ - ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి యీవులెంచుము నీ వాశ్చర్యమందెదవు వాటికై
పల్లవి:ఎంచుము లెక్కించు మీవులన్ - ఎంచి, చూడు మేసు దీవెనల్ఎంచు, మెంచు - మెంచు మీవులన్ - వింత నొందెదవు నీవు వాటికై
2. చిOత మానసంబు నీకు గల్గినన్ - వంతచే భారంబు గల్గు నీయెదన్ సంతసంబుతోడ నెంచు మీవులన్ వింతతో స్మరించు మేసు నామమున్ ||ఎంచు||
3. నాశనంబు జెందు నాస్తి జూచినన్ - వాసిగా శ్రీయేసు నా కొసంగిన భాసురంపు భాగ్యము - దలంపుమా యీ సుభాగ్యమే కదా సదాయుండు ||ఎంచు||
4. జీవితాదియందు ధైర్య మొందుము - దేవుడుండు తన వార్కి తోడుగ జీవయాత్రయందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు ||ఎంచు||