పల్లవి:యెహోవా నీ యొక్క మాట చొప్పున (2)నీ దాసునికి మేలు చేసియున్నావు (2)
1. మంచి వివేచన మంచి జ్ఞానము (2) - కర్త నీవే నాకు బోధ చేయుము (2) నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని (2)
2. నాకు శ్రమ కలుగక మునుపు - నా దేవా నేను త్రోవ వీడితిని నేడు నీ మాట నెరవేర్చు చున్నాను
3. దేవా నీవు దయగలవాడవు - దేవా నీవు మేలు చేయుచున్నావునీ కట్టడల నాకు బోధించుము
4. గర్విష్ఠులు నాకు విరోధముగా - కల్పించుదురెన్నో అబద్ధములు నీ యుపదేశము లనుసరింతును
5. వారి హృదయములు క్రొవ్వువలె - చాల మందముగానై యున్నవి ఆజ్ఞలలో ఆనందించుచున్నాను
6. దేవా నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లు శ్రమల నొంది యుండుట నాకు యెంతో మేలాయెను
7. వేలాది వెండి నాణెముల కంటె - వేలాది బంగారు నాణెముల కంటె నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు