1. యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావలెన్ నీవు మమ్మును బోషించు - మమ్ము జేర్చు దొడ్డిలోన్ యేసునాథా! ప్రియనాథా! మమ్ము విమోచింపుమా
2. మమ్ము నాదరించు యేసూ - మాకు పాలకుండవు పాప మార్గమందు నుండి - ప్రేమతో దప్పించుమీ యేసునాథా! ప్రియనాథా! మొఱనాలకించుమా
3. బీద పాపులైన మమ్ము - నీ వంగీకరింతువు మమ్మును బవిత్రపర్చి - మమ్ము విడిపించుమీ యేసునాథా! ప్రియనాథా! నిన్ను నాశ్రయింతుము
4. బాల్యమందు నిన్నుఁ జేరి - నిన్ను హత్తుకొందుము ప్రియ రక్షకుండ, యేసూ! నీదు ప్రేమఁజూపుమా యేసునాథా! ప్రియనాథా! మమ్మింకఁబ్రేమించుమా