1. నీ చెంతకో ప్రభో - నే జేరెదన్ - కష్టంబు లేచినన్ - నిన్ జేరెద నా పాట యెప్పుడు - నీ చెంత నుండును - నీ చెంత నుందును - నా రక్షకా
2. భానుండు ద్రిమ్మరి - యట్లిప్పుడు - క్రుంకంగ నిక్కడ నా చుట్టును చీకట్లు గ్రమ్మినన్ - స్వప్నంబు నందును - నీ చెంతనుందును - నా రక్షకా
3. ఆకాశమండల - మార్గంబును - నాకీవు చూపుమా - నీ కూర్మిచే నీ దివ్యదూతలు - నన్ గోరి పిల్వగా - నీ చెంతనుందును - నా రక్షకా
4. నే నిద్రలేక నీ - స్తోత్రంబుతో - శోకంపు రాళ్ళుగ - బేతేలును నీకై నిర్మింతును - నా దుఃఖమందున - నీ చెంతనుందును - నా రక్షకా
5. ఆనంద పూర్ణమై - పక్షంబులన్ - నాకంబు నంటుచు - నే లేచినన్ నా పాటయంతయు - నీ చెంతనుండు - నీ చెంతనుందును - నా రక్షకా