పల్లవి:లేలెమ్ము సీయోను - ధరియించుము నీ బలము (2)సుందర వస్త్రముల ధరించు (2) - పరిశుద్ధ పట్టణమా (2)లేలెమ్ము సీయోను (1)
1. నిష్కళంక యెరూషలేమా (2) - ఇంకెన్నటికి నీ మధ్యకు (1) నిష్కళంక యెరూషలేమా (2) - ఇంకెన్నటికి నీ మధ్యకు (1) సున్నతి పొందని అపవిత్రులును (2) - లోనికి రారెన్నడు (2)
2. లెమ్ము నీవు తేజరిల్లుము - వెలుగు నీకు వచ్చియున్నది యెహోవా మహిమ నీ మీద - ఉదయించెను లేలెమ్ము
3. మనుష్యులను పశువులను - విస్తరింప జేసెదను అభివృద్ధి నొందును అపూర్వముగ - పూర్వస్థానములో నిన్నుంతున్
4. మునుపటికంటె అధికమైన - మేలు నీకు కలుగజేతును అపుడు నీవు యెహోవా నేనని - వివరముగా నెరిగెదవు
5. అందుచేతనే చెప్పుచున్నాడు - నిద్రించే నీవు మేలుకొనుము మృతులలో నుండి లేచిరమ్ము ప్రకాశించును క్రీస్తు