పల్లవి:యూదాయందు దేవా ప్రసిద్ధుడవు - నామమెం గొప్పది తఇశ్రాయేలులో (1)షాలోము నందు గుడారముండగా - సీయోనులో నీ సన్నిధి గాంచితి (2)
1. స్ముర్నలో నున్న సంఘపు దూతకు - సందేశంబు నిచ్చితివి మొదటి కడపటి వాడను నేనె - మృతుడైతిని గాని జీవించుచుంటిని
2. ఎరుగుదును నీ శ్రమ దుఖఃమును - దరిద్రతను నీ దరిద్రతను అయినను నీవు ధనవంతుడవే - అని సెలవిచ్చి హెచ్చించితివి
3. యూదులు కాకయే యూదులమనుచు - సాతాను సేనలు బ్రమపరచ శ్రమలకు నీవు భయపడవలదని - అభయంబిచ్చి బ్రోచిన ప్రభో
4. నమ్మకముగా నీవు నుండుము నిరతము - ప్రాణాపాయము కలిగినను ధరియింప జేతును జీవ కిరీటము - వనరుగా నీపై ననినట్టి ప్రభువా
5. సెలవిచ్చుచుంటివి ఆత్మస్వరముతో - చెవిగల వాడు జయించు విని ఏ హాని చేయదు రెండవ మరణము - పొందెదరు నిత్య స్వాస్థ్యమును
6. సిలువయే నీదు స్ముర్నగా కాగా - నిలువక సాగుము శ్రమలందు ఎంచక నీదు విలువేమాత్రం - అని సెలవిచ్చిన నా ప్రియయేసు
7. మనుష్యకు మారుడు మహిమతో రాగ - ప్రతిఫలమొందు ప్రతివాడు ధవళ సింహాసనమందున్న ప్రభువే ఘన స్తుతినొందును తన ప్రజలందు