పల్లవి:యెహోవాను నమ్ముకొను మానవులు ఈ మహిలోన ధన్యులు (2)ఆయనపై నిరీక్షణను నుంచువారు ధన్యులు వారు (1)
1. జలము యొద్ద నాటబడిన - చెట్టువలె అది యుండును (2) కాల్వల యోరను వేళ్లు తన్నును - కదలదు తుఫాను గాలులున్న (2)
2. వెట్ట కలిగినను భయపడదు - ఆకులు పచ్చగా నుండును వర్షములేని సంవత్సరమున - చింతించదు కాపు మానదు
3. హృదయము అన్నిటికంటే - బహు మోసకరమైనది అది ఘోరమైన దుష్టత్వమైనది - దీని నెరుగువారెవ్వరు
4. యెహోవా నగు నేను పరీక్షింతు - అందరి అంతరీంద్రములను ప్రతివాని క్రియల ప్రవర్తనను బట్టి - నేను ప్రతిఫలమిత్తును
5. ఓ యెహోవా పరమ తండ్రి - ఇశ్రాయేలాధారుడా నిన్ను విసర్జించు వారందరిలలో - సిగు నొందెదరు గాక
6. ద్రోహులు నన్ను విసర్జించిరి - జీవ జల ఊటనైన నన్ను ఇసుక మీద పేరు వ్రాయ బడినట్లు - అట్టివారి పేరు నుండుగా
7. దేవా నన్ను స్వస్థపరచు - నేను స్వస్థత నొందెదను దేవా రక్షించుము రక్షింప బడుదును - నా సోత్రములకు ఆధారుడా