పల్లవి:ఆకాశ మహా - కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా (2)
1. కృపజూపి నిబంధనను - నెరవేర్చిన ఉపకారి (2) కాపాడితివి నడిపితివి (2)- నీ యింటికి మమ్ములను (2)
2. నీ దాసునికి నీ ప్రజలకు - నీ క్షమను కనుపరచు నీదు కల్వరి రక్తమున - నీవె కడుగు కరుణామయ
3. నీతి న్యాయముల కర్త - ప్రీతితోడ నీ ప్రజలకు నీతి న్యాయముల నిమ్ము - స్తుతియింప నిరతంబు
4. రాజులనుగా యాజకులనుగా - మము చేసిన మా రాజా విజయమిమ్ము మా విజయుండా - నిజమైన నీ ప్రజలకు
5. కరువు తెగులు కష్టనష్టముల్ - వర్ష లేమి పురుగు బాధల్ కరుణజూపి విడిపించి - మురిపించుము మమ్ములను
6. సమాధాన సంతోషము - ఆదరణ ఆలోచన అనుభవింప ననుగ్రహించు - మనిశంబు మాకిచట
7. బలపరచు నీ భక్తులను - బలము తోడ ప్రవేశించి విలువైన నీ రక్షణన్ను - ధరింపజేయు మల్లెలూయ