పల్లవి:ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము - పరిపూర్ణముగా - జీవము నిమ్ముపావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ - పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము (2)
1. నిను హృదయంబార - ప్రేమించునట్లు - నింపుము నా మది - ప్రేమాగ్నితో (2) సర్వము హృదయము - కాయము నిచ్చెద - స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము (2)
2. యేసు స్తుతి నే పాడునట్లు - ఆశనొసగుము - నా హృదయములో నన్నుండి జీవము - ప్రవహించునట్లు-నీలో సంతృప్తిగ త్రాగెదను
3. ప్రశస్తరక్తమున - కడుగుము - పాప మృత్యువు నుండి విడిపించుము సింహాసనం నాలో స్థాపించి-వాగ్దానము నెరవేర్చుము నాలో