పల్లవి:పరమాశీర్వాదము కోరి - పరలోక పితా అరుదెంచితిమి (2)
1. తండ్రీ యోగ్యతలేని మాకు నేడే దయచేయుము నీశక్తి (2) హృదయముల ఖాళీజేసి (2) పరలోక పితా అరుదెంచితిమి (1)
2. ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున సిగ్గునొంది మాదు శిరములను వాల్చి - పరలోక పితా అరుదెంచితిమి
3. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే నిన్నే సదా స్తుతియించెదము - పరలోక పితా అరుదెంచితిమి
4. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము నీ దాసులను మరువకుము - పరలోక పితా అరుదెంచితిమి