CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 566

శుద్ధ ఆత్మ దిగిరమ్ము మా పై

shuddha aatma digirammu maa pai

Acts 2:18

More
Reference recording on YouTube ↗
1. శుద్ధ ఆత్మ దిగిరమ్ము - మా పై వేగమే - శుద్ధి యేసు నీ ఈవుల మాకీయుమా (2)
2. పెంతెకోస్తను నాట దిగివచ్చిన - ప్రియ ఆత్మ దిగిరమ్ము ఈ వేళయందు
3. దప్పిగొన్న ఆత్మలను దప్పి తీర్చును - తప్పక ఒక్కొక్కరిని సంధించు వేగ
4. ప్రేమతోడనే శుద్ధ పావురమా రా - డాసి మమ్ము యుద్ధమునకు సిద్ధపర్చుమా
5. నిద్ర కష్టముల సోమరత్వమున్ వీడి - స్తోత్రింప నుత్సాహమును మా పై పోయుమా
6. గత కాలమందు జయమిచ్చిన యట్టి - నూతన ప్రార్థన వాంఛ మాలో పోయుమా
7. అనుదిన మాత్మలను సంపాదించను - గిన్నెనిండి పొర్లిపార నాత్మనీయుము
8. ప్రేమ దీనత్వము శాంత సమాధానముల్ సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా

Back to Hebron Seeyonu Geethalu