CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 570

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను

karuninchi tirigi samakoorchu prabhuvaa kshamaapana ninnu veduchunnaanu

1 Samuel 30:19

More
Reference recording on YouTube ↗
పల్లవి:కరుణించి తిరిగి - సమకూర్చు ప్రభువా (2) - క్షమాపణ నిన్ను - వేడుచున్నాను (2)
1. దావీదు రాజు - దీనుడై వేడ (2) - అవనిలో బొందిన నష్టములన్నియు (2) దేవా నీవు - సమకూర్చితివే (2)
2. శత్రు సమూహపు - కుతంత్రములతో - బొత్తిగ నేను - నష్టపడితిని మిత్రుడేసులో - సమకూర్చుము తండ్రి
3. పసరు గొంగళి - చీడ పురుగులు - నాశము చేసిన - పంటను కూర్చుమ యేసు ప్రభూ - నిన్ను వేడుచున్నాను
4. ప్రేమ సంతోషా - నందములను - ప్రధాన యాజకా - పోగొట్టు కొంటిని ప్రేమతో నీవు - సమకూర్చుమా
5. పాపపు విషముతో నా పాత్ర నిండెను - ప్రభు యేసుండను పిండిని కలుపుము పాప మరణమును - తొలగించుమా
6. ఆత్మీయ సోమరి - తనములో నుండి - ఆత్మనష్టముల - నెన్నియో బొందితి ఆత్మదేవా నీవు - సమకూర్చుమా
7. పాపము చేసి - పడియున్న చోటున్ - ప్రాపుగ నీవు - జూపుమో ప్రభువా కోపగించక నాపై - కృప జూపుమా
8. చేసిన పాపము - కప్పుకొనక - విశ్వాసముతో - ఒప్పుకొందున్ సిలువరక్తముతో - శుద్ధి చేయుమా

Back to Hebron Seeyonu Geethalu