CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 571

మా మొర నాలకించుము మహారాజ యేసు ప్రభువా

maa mora naalakinchumu mahaaraaja yesu prabhuvaa

Psalms 22:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:మా మొర నాలకించుము - మహారాజ యేసు ప్రభువా (1)కోపముతో నను జూడకుము (1)- కనికరమున పలుకుము (2)
1. నిన్నెట్లు విడనాడెదను - ప్రాణప్రియుడా నా యేసు (2) సిలువకు జడియలేదు - శ్రమలకు బెదురలేదు (2) నీ నోట దూషణమాట (2) - ఒకటైనను రాలేదు (2)
2. పరలోకమును విడచితివి - పాపులకై ఏతెంచితివి సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి ఇట్టి నీ ప్రేమకు నేను - ఎట్టి ధనమియ్యగలను
3. సమస్త లోకమునకు - నీ రక్తము నిచ్చితివి మూయబడిన యీ తలుపు - తీయబడెను నీ వలన నే నేల నీ సంస్తుతిని - నిరతంబు చేయకపోతి
4. జగమంత నీ రాకడను - నిరీక్షించుచుండెను నీ నీతిని నెరవేర్చుటకు - ఖ్యాతిగ నరుదెంచితివి నిబంధన ననుసరించి - విముక్తిని మా కొసగితివి
5. రక్షకుండా పాపులను - శిక్షించక రక్షించు నిత్యజీవము నిమ్ము - ఆత్మయందు దీనులకు దైవ కుమారా యేసు - సార్వత్రిక నివాసీ

Back to Hebron Seeyonu Geethalu