పల్లవి:ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము (2) - విరిగిన మనస్సుతో నే వేడెదను (2)ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము (2)
1. కోల్పోయితిని మొదటి ప్రేమను - చల్లారిపోయె నీ ప్రేమ నాలో (2) నాలో నిలుపుము నీదు ప్రేమ (2)
2. పడినవారి యాశ్రయమా - విడువ బడిన వారి సహాయుండా గాయపు చేతితో లేపుమా
3. శత్రుని యురిలో చిక్కియున్నాను - నాదు బంధకమును తెంపుము నీవు ఆనందము నిమ్ము మరల నాకు
4. దోషిని నేను నీకు సఖులకు - అడుగుచుంటిని మన్నన మిమ్ము కడుగుము నీదు రక్తములోన
5. ఐక్యతయే నా యభిలాష - నాదు చేదును తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము
6. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా - వడిగా నీదు ఉజ్జీవము నిమ్ము బూడిద చేయుము నాలోని మన్షున్
7. ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమున - కదలింపగ వ్యాపింప జేయుము హృదయమును ఫలియింప చేయుము