CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 573

ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో

prabhuvaa nee kaaryamunu nootana parachumu maalo

Habakkuk 3:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభువా నీ కార్యమును (1) - నూతన పరచుము మాలో (2)పరిశుద్ధ దేవా నీకు (1) - ప్రజలమై యున్నా మిలలో (2)
1. సంవత్సరములు జరుగు - చుండగనే సత్యదేవా (2) విలువైన నీదు కార్యమును (2) - తెలియజేయుము మాకు (2)
2. పాపము జేసి నీదు - కోపము రేపితిమయ్యా కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా
3. ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యా ప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను
4. వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువా పలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా
5. మారుచున్న లోకమున - కారుతొట్లలో త్రాగన్ జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా
6. సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యా ఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము
7. మేలిమి బంగారుగను - మమ్ముల జేసితివయ్యా మాలిన్యమునంటి మేము - మందగిలియున్నాము
8. మాటతప్పని మాదేవా - కోటగా నున్నావయ్యా చాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా

Back to Hebron Seeyonu Geethalu