పల్లవి:వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను (2)తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు (2)
1. మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును (2) మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా (2)
2. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము
3. అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే
4. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము
5. ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దాని యందు ప్రభు మహిమనిండి తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను
6. సజీవ రాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు దేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం