CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 584

ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు నీవే సింహాసనాసీనుడవైతివి

o karunaanidhee, mahaa prabhuyesu neeve sinhaasanaaseenudavaitivi

Revelation 5:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ కరుణానిధీ, మహా ప్రభుయేసు (2) - నీవే సింహాసనాసీనుడవైతివి (2)
1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు (2) దావీదు తాళము కల్గియున్నావు (2) నీవు తెరచినది మూయగలేరు (2) బంధించినది తెరువగలేరెవ్వరు (2) నీ మహాత్మ్యమదే (2)
2. ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య సంచరించెదవు జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా అదియే నీ ఘనత
3. అగ్నివంటి నేత్రములు కల్గి - అపరాపరంజి వంటి పాదములు కలిగి దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంధము తెరచే యోగ్యుడవీవే ధన్యుడవు నీవే
4. నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమెన్ అనువాడు
5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు నిను కొనియాడెదము

Back to Hebron Seeyonu Geethalu