పల్లవి:యెహోవా సేవకులారా స్తుతించుడి - ఆయన నామమును స్తుతించుడి (1)
అను పల్లవి:యెహోవా మందిర ఆవరణములలో (2)నిలుచుండు వారలారా మీరు (1)
1. యెహోవా దయాళుడు ఆయన నామమును - కీర్తించుడి అది మనోహరము (1) యాకోబును తనకొర కేర్పరచుకొని (2) ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్ (1)
2. యెహోవా సకల దేవతల కంటెను - గొప్పవాడని నేనెరుంగుదున్ భూమ్యాకాశములు మహా సముద్రము - లందాయన కిష్టమైనవి చేసెను
3. భూమి దిగంతముల నుండి ఆవిరి - లేవజేసి వాన కురియునట్లు మెరుపును పుట్టించి తన నిధులలో నుండి గాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే
4. ఐగుప్తు జనుల తొలిచూలులను - పశువుల తొలిచూలుల జంపెను ఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుట సూచనల మహాత్కార్యముల జేసె
5. అన్యులనేకులను శక్తిగల - రాజులనేకులను చంపెను అమోరీయుల రాజైన సీహోనును బాషాను రాజగు ఓగును చంపెను
6. కనాను రాజ్యముల పాడుచేసియు - నిశ్రాయేలేయుల కప్పగించెను యెహోవా నీ నామము నిత్యముండున్ నీ జ్ఞాపకార్థము తర తరములకును
7. యెహోవా తనదగు ప్రజలకు తానే - న్యాయము తీర్చును హల్లెలూయ తన వారగు తన సేవకులను బట్టి సంతాపము నొందు నాయనల్లేలూయ