CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 590

ఓ ప్రార్థనా సు ప్రార్థనా నీ ప్రాభవంబున్ మరతునా?

o praarthanaa su praarthanaa nee praabhavambun maratunaa?

More
Reference recording on YouTube ↗
1. ఓ ప్రార్థనా సు ప్రార్థనా - నీ ప్రాభవంబున్ మరతునా? (1) నా ప్రభువున్ ముఖాముఖిన్ - నేబ్రణుతింతు నీ ప్రభున్ (1) నా ప్రాణమౌ సు ప్రార్థనా - నీ ప్రేరణంబుచే గదా (1) నీ ప్రేమధార గ్రోలుదు - నో ప్రార్థనా సు ప్రార్థనా - (2)
2. పిశాచి నన్ను యుక్తితో - వశంబుచేయ జూచుచో నీ శాంతమైన దీప్తియే - నా శంకలెల్ల మానుపున్ నీ శక్తి నేను మరతునా - నా శైలమైన ప్రార్థనా నాశోక మెల్లదీర్చెడు - విశేషమైన ప్రార్థనా
3. నీ దివ్యమైన రెక్కలే - నా దుఃఖభారమెల్లను నా దేవుడేసు చెంతకు - మోదంబు గాంచుబోవును సదా శుభంబులొందను - విధంబు జూప నీవెగ నా ధైర్యమిచ్చు ప్రార్థనా - సుధాసుధార ప్రార్ధనా
4. అరణ్యమైన భూమిలో - నా రమ్యమౌ పిస్గా నగం బురంగుగాను నెక్కి నా - చిర గృహంబు జూతును శరీరమున్ విదల్చి నే - బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ - బరే శు ధ్యాన ప్రార్థనా

Back to Hebron Seeyonu Geethalu