పల్లవి:ఒక్కొక్క గంట నేను - నిన్నాశించుకొందు - నీ యాశీర్వాదమిమ్ము - నా రక్షకుడా
1. యేసూ నా ప్రభువా - నీ ప్రేమ లేకున్న నా యాత్మ కేదియు - విశ్రాంతి నియ్యదు
2. యేసూ, రేబగళ్ళు - నాయొద్ద నుండుము నాతో నీ వుండిన - ఏ భయముండదు || ఒక్కొక్క ||
3. సుఖంబు నొందగా - నిన్నే యాశింతును దుఃఖంబు నొందగా నీవే శరణ్యము || ఒక్కొక్క ||
4. నీదు మార్గమందున - నే నడ్వనేర్పుము నీ మాట చొప్పున నన్నున్ దీవించుము || ఒక్కొక్క ||
5. నిన్నే యాశింతును - యేసూ నా ప్రభువా నీ వంటి వాడనై నన్నుండ జేయుము || ఒక్కొక్క ||