CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 594

గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే

gunavanturaalaina ghanamaina streeye

Proverbs 31:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:గుణవంతురాలైన ఘనమైన స్త్రీయేగొప్పది యెంతో వెలగల ముత్యము కన్న
1. క్రీస్తేసు రక్తములో కడుగబడి - కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే కొనియాడ తగినది ధన్యురాలు తానే
2. నీ జనమే నా జనమని ఎంచుకొని - నిజదేవుని వెదకి వెంటాడిన రూతు కొనియాడ తగినది ధన్యురాలు తానే
3. దేవుని సన్నిధిలో ప్రార్థించగా - దేవుడు హన్నా ప్రార్థన వినెను కొనియాడ తగినది ధన్యురాలు తానే
4. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి - యుద్దము జయించెను దెబోరా కొనియాడ తగినది ధన్యురాలు తానే
5. నేను నశించిన నశించెదనని - తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె కొనియాడ తగినది ధన్యురాలు తానే
6. ఆభరణ వస్త్రాలంకారముగాక - అక్షయాలంకారము కల్గిన స్త్రీయే కొనియాడ తగినది ధన్యురాలు తానే
7. ప్రభుయేసుని గుణగణములను కల్గి - పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే కొనియాడ తగినది ధన్యురాలు తానే

Back to Hebron Seeyonu Geethalu