పల్లవి:విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని (2)
1. నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2) పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2)
2. నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమనుగల్గి - పోరాడుడి విజయముతో
3. ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో
4. క్రీస్తేసు మనన్సు కలిగి - సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో
5. దీన మనన్సు కలిగి - ప్రియులారా లోబడియు మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో
6. ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో
7. యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము